తెలుగు గౌరవం:--పోడేటి సమజ్ఞ, 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెగ్యాంమండలం. వెల్గటూర్, జిల్లా. జగిత్యాల.తెలంగాణ

 ఉగాది పండుగ వచ్చింది
కొత్త రుచులను తెచ్చింది
కష్టసుఖాలను తెలిపింది
కొత్త జీవితం మొదలైంది
మంచికి మార్గం చూపింది
తెలుగుజాతికి పేరు తెచ్చింది
వసంత కోకిల కూసింది
నెమలి నాట్యం చేసింది
ఆనందమునే తెచ్చింది
ఆత్మీయతనే పంచింది
అందరినీ కలిపింది
తెలుగు గౌరవం నిలిపింది.
 

కామెంట్‌లు