ఒక గ్రామంలో రాముడు అనే అబ్బాయి ఉండేవాడు.వాడి అమ్మ పేరు ఆదెమ్మ.వాడి తండ్రి ఒక ప్రమాదంలో చనిపోయాడు.
ఆదెమ్మకు పుండ్లు, గాయాలు నయం చేసే వైద్యం తెలుసు.అవసరమైన ఆకులు అడవి నుండి తెచ్చుకుని నూరి ,పసరు తయారుచేసుకునేది.గాయాలు,పుండ్లతో బాధ పడేవారికి వైద్యం చేసి నయం చేసేది.అందుకు బదులుగా డబ్బులివ్వబోతే "నేను చేసిందేముంది?ఆకు పసరు కట్టు కట్టాను అంతే" అని ఏమీ తీసుకునేదికాదు.పనికెళ్ళి కూలి డబ్బులతో జీవిస్తూ కొడుకును చదివిస్తోంది.ఎందరో పేదవారికి ఆదెమ్మ అంటే గౌరవం.ఆమె
రాముడికి మందు మొక్కలను పరిచయం చేసింది.వాడికిఅమ్మలాగే మంచిగుణాలు అబ్బినాయి.
ఒక రోజు రాముడు మందు ఆకుల కోసం అడవి కెళ్ళాడు .వాడికి అడవి మొదట్లో ఒక జింక పిల్ల కనిపించింది.అది గాయాలతో పడుకుని బాధతో మూలుగుతూ ఉంది.జాలిగుండె గల రాముడు ఆకులు తెచ్చి నూరి గాయాలకు రాశాడు.
.దానికి ఆహారం తెచ్చి వేశాడు.తర్వాత పెద్ద ఆకును మడిచి దోనెలా చేసి దగ్గరలో నున్న కుంట నుండి నీళ్ళు తీసుకుని వచ్చాడు.అక్కడ జింకలేదు.దాని స్థానంలో ఒక మరుగుజ్జు దెయ్యం కనిపించింది.దాన్ని చూసి రాముడు ఉలిక్కిపడ్డాడు.
అప్పుడు మరుగుజ్జు దెయ్యం "భయపడకు అని రాముడి వివరాలడిగి తెలుసుకుంది.తర్వాత నేను చెప్పేది విను అంటూ తన గురించి ఇలా చెప్పింది."నా పేరు చంద్రయ్య.నేను పెద్ద ధనవంతుడిని.కానీ పిసినారితనంతో ఎవ్వరికీ ఒక్క మెతుకు కూడా దానం చెయ్యలేదు.అందువల్ల చనిపోయాక మరుగుజ్జు దెయ్యానయ్యాను.జాలి గుండెతో నలుగురికీ సహాయపడేనీలాంటి ఓపాతికమందికి సాయం చేస్తే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుందని ఒక సాధువు చెప్పాడు.
మీ అమ్మ,నీవూ గుణవంతులు.మీ సహకారగుణం నాకు నచ్చింది.నీ గుణాన్ని పరీక్షించడానికే జింకలా కనిపించాను.ఎందరో పట్టించు కోకుండా వెళ్ళిపోయారు.నీవుఆగి మంచి మనసుతో వైద్యంచేశావు.నే నిచ్చే ధనం
మీకోసం,మంచిపనులకోసం వాడండి.నాకు విముక్తి దొరుకుతుంది"అని చెప్పి చాలా ధనమిచ్చిపంపింది.
ఆ ధనంతో వాళ్ళు ధనవంతులయ్యారు.భూమి కొని పంటలు పండిస్తూ తమ సంపాదనతో పేదలకు సాయంచేస్తూ జీవించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి