తాతయ్య కబుర్లు-9.-- ఎన్నవెళ్లి రాజమౌళి


 పిల్లలూ! బట్టి విధానం వద్దని ప్రభుత్వం చెబుతోంది. కానీ, కొన్నింటికి తప్పదేమో... పద్యాలు, ఎక్కాలు, నెలల పేర్లు, వారాల పేర్లు తదితరాలకు తప్పదు కదా! నేను చిన్నగా ఉన్నప్పుడు బట్టీ పట్టిన పద్యాలు కాని, ఎక్కాలు కానీ ఇప్పటికీ గుర్తున్నాయి. చెట్టు కింద రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానులు, జిల్లాల పేర్లు కూడా బట్టి పట్టించేవారు. ఇవే కాక, గుణింతాలు కూడా బట్టి పట్టేవాళ్ళం. ఇప్పటి పిల్లలు ఎక్కాలు అడిగితే ఫోన్ లో గుణకారం చేస్తున్నారు. కనీసం 12 ఎక్కాల వరకైనా రావాలి. అప్పుడే గుణకారం చేసుకోవడానికి వీలుంటుంది కదా! పద్యాలు, నెలలు తదితరాలు రావాలంటే బట్టి పట్టాల్సిందే కదా!