కొత్త సంవత్సరం:-సామల శివ తేజ, 9 వ తరగతి-తండ్రి పేరు: సామల రాజయ్యఊరు: చెగ్యాం, మండలం: వెల్గటూర్జిల్లా: జగిత్యాల

 కొత్త సంవత్సరం వచ్చింది
కోటి ఆశలు తెచ్చింది
కొత్త పచ్చడి వచ్చింది
కొత్త రుచులను తెచ్చింది
కొత్త పంచాంగం వచ్చింది
కోరికలెన్నో తెచ్చింది
వసంత కాలం వచ్చింది
ఉగాది పండుగ తెచ్చింది
కోకిల గానం చేసింది
నెమలి నాట్యం చేసింది
కాలం మార్పు చెందింది
గతమునంతా మరుద్దాము
భవిష్యత్తుకై ఎదురు చూద్దాము

కామెంట్‌లు