భావి భారత నిర్మాతలు :-- లీలా కృష్ణ.తెనాలి.
మేంపిల్లమండీ పిల్లలం..
రేపటి రోజున పెద్దలం.

పిడుగులమండీ, పిడుగులం..
నిత్యం మెరిసే మెరుపులం.

భారత చరితకు వందనం..
మేం నమ్మిన మార్గం .. ఎదిగేకొద్దీ ఒదగడం.

సమ్మేళనం ఘన సమ్మేళనం..
సర్వ జాతుల సమ్మేళనం , మా భారత వనం.

గర్వకారణం మాకెంతో గర్వకారణం..
దేశం కోసం ప్రాణాలొదిలిన మా త్యాగమూర్తులులే ...మాకు గర్వకారణం.

కలాం గారి కలలకు.. మేమే వారసులం.
కళలను పోషించుట,కష్టాలను చేదించుట ...మా సహజగుణం.

భావిభారత బంగారు భవితకు, బాధ్యులం.

అతి పెద్ద ప్రజాస్వామ్యపు పౌరులం.

భిన్నత్వంలో ఏకత్వం.. ఈ లోకానికి మేము చూపించిన మార్గం.

సర్వేజనా సుఖినోభవంతు అని కోరుటయే మా సుగుణం.