యుధ్ధంవద్దు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ .


 అమరావతి రాజ్య శివార్లలో ఆశ్రమం నిర్మించుకొని విద్యాదానం చేయసాగాడు.ఒకరోజు విద్యార్ధులకు భోధనచేస్తూ...'విద్యాదానంచేసే గురువు త్రిమూర్తి స్వరూపుడని ,మాతృదేవోభవ, పిత్రుదేవోభవ, ఆచార్యదేవోభవ అనేశృతి వాక్యం తెలియని భారతీయుడు ఉండడు. ప్రతివ్యక్తికి తొలిగురువుతల్లే ,మలిగురువుతండ్రి, లౌకిక, అలౌకిక, అతనుభగవత్ స్వరూపు డైన విజ్ఞానదాత.నడయాడే మూడవ దేవుడు అవుతాడు.విషయపరిజ్ఞానాన్ని కలిగించేవాడే గురువు. విద్యకోసం  ఆర్తి,  జిజ్ఞాస,సంసిధ్ధత,వినయం,శరణాగతి,భక్తి,శ్రధ్ధ, గౌరవం వంటి లక్షణాలు కలిగినవాడు,ఉత్తమశిష్యుడు అవుతాడు'....ఇంతలో రాజభటులు ఆశ్రమంలో ప్రవేసించి రాజు గారు సదానందుని ఆశీర్వాదం కొరకు వస్తున్నారని,తెలియజేయడంతో శిష్యులు అందరిని ఆశ్రమం లోనికి పంపించాడు. సదానందునివద్దకు వచ్చిన చంద్రసేనమహారాజు నమస్కరిస్తూ 'స్వామి రాజ్యవిస్తీర్ణత,కోశాగారం నింపడానికి పలు రాజ్యాలు జయించడానికి బయలుదేరి వెళుతున్నాను.నాకు విజయంచేకూరాలని దీవించండి'అన్నాడు.దీర్ఘగా నిట్టూర్చిన సదానందుడు,'మహరాజా మీరు పలురాజ్యాలుజయించిధనంసంపాదించితెచ్చినధనంఏంచేస్తారు.అన్నాడు.'స్వామినాకోశాగారంనింపుతాను.మిక్కిలిధనవంతుడిగా గుర్తింపు పొందుతాను'అన్నాడు.'మహారాజాఎదటివారికివినియోగపడనిధనం,విద్యా,వ్యర్ధంకదా.ఎన్నోరాజ్యాలుజయించాలిఅన్నఆరాటంలోవేలమందిమరణిస్తారు,ఎందరోక్షతగాత్రులుఅవుతారు,ఇందరినిబాధించి జయించిన రాజ్యానికిఎవరినోప్రతినిధిగాఉంచుతారు.వారిపైనిఘూ పెట్టి ఎప్పుడు ఎవరు ఎదురుతిరుగు తారో అన్న ఆలోచనలతోసతమతం అవుతారు.అలాగే మీకోసంయుధ్ధంలో మరణించిన వారికుటుంబాలు ఏమౌతాయి.యుధ్ధంవలన ప్రగతి యిరు దేశాలలో స్ధంబిస్తుంది. ఆహరధాన్యాలకొరత,పలురకాల యిబ్బందులు రెండు దేశాలప్రజలు ఎదుర్కనవలసివస్తుంది.యుధ్ధంవలన అంతా క్షామమే,ఎంతోధనం కర్చు పెట్టాలి ఎన్నో ప్రయాసలు అనుభవించాలి.విజయం ఎవరి సొంతముకాదు. పోరాటం ఆత్మరక్షణకొరకు,అన్యాయం జరిగినపుడు చేయాలి.ఆలోచించండి మనదేశాభివృధ్ధి పై దృష్టిసారించండి'అన్నాడు సదానందుడు.'నిజమే స్వామి  ఉన్నదానితో త్రుప్తిగా జీవించాలి.లేనిదానికోసం ఆరాటపడటం,గాలిలో మేడలు కట్టడంవంటిది.నాకళ్ళు తెరిపించారు.వేలమందినిబలి తీసుకునే యుధ్ధంవద్దు.శాంతిజీవనం గొప్పది.శెలవు'అన్నాడు చంద్రసేనమహరాజు.