తేదీ 26-10-2014న, రాత్రి 9 గంటలకు ఫోన్ వచ్చింది. నమస్తే తెలంగాణ ల బతుకమ్మ లో మార్చి 2014న, వచ్చిన నా కథ గురించి అరగంట మాట్లాడారు. ఆయన పేరు చెప్పరు. కథ బాగుందని, ఈ కథలో పూడిక తీయడం, కట్ట మరమ్మతు చేయడం, ఇది అంతా మిషన్ కాకతీయ కు ఆదర్శం అన్నారు. అంత పెద్ద మాటలు ఎందుకు సార్. నా కథ, మిషన్ కాకతీయ కాకతాళీయం కావచ్చు? అన్నాను. మీరు పేరు చెప్పండి సార్. అంటే... నా గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుసు అన్నారు. ఎంత ప్రయత్నించినా నా గొంతు గుర్తు పట్టలేకపోయాను. మీ పేరు చెప్పండి సార్ అని, ఎంత కోరినా చెప్పకుండా నా కథ గురించి బాగా చెప్పారు. మీ దగ్గర ఈ కథా సంపుటికి సరిపడా కథలు ఉన్నాయా అని అడుగగా-ఉన్నవి అన్నాను. నేను ఆ పుస్తకాన్ని వేయిస్తా అని కూడా అన్నారు. సంతోషం సార్. మీ పేరు చెప్పండి సార్ అని, మళ్లీ అడిగాను. జయ జయహే తెలంగాణ. జననీ జయకేతనం అని, రెండు లైన్లు పాడారు. సార్! మీరా అందెశ్రీ గారు. అని నేను అనగానే పక్కన నవ్వారు. నాది ఎంత అదృష్టం సార్. మీతోని అరగంట మాట్లాడాను. అన్నాను. మళ్లీ నవ్వుతూనే... బై బై చెప్పారు. నేను కూడా అందెశ్రీ గారికి బై చెప్పాను .
'అదృష్టం'...ఎన్నవెళ్లి రాజమౌళి , కథల తాతయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి