షాడోలు :--ఎం.వి. ఉమాదేవి నెల్లూరు
నీలి కన్నులు 
నెమలి ఈకలు 
ఉరుము మబ్బులు 
హృద్య నాట్యమదే ఉమా!

పచ్చ మేనున 
యెర్ర ముక్కున 
చిలక పలుకున
తోట మురిసేకద ఉమా!

తుర్రు మంటూ 
కొమ్మ లంటూ 
ఉడుతలుంటూ 
పండుతో సందడె ఉమా!

భీతి చూపులు 
చిన్న గంతులు 
లేత దుంపలు 
కుందేలమ్మ తిను ఉమా!

పెద్ద ఏనుగు 
అరటి,చెఱుకగు  
తిండి కళయగు 
గజరాజు అడవికి ఉమా!

పిల్ల కోతులు 
కుప్పి గెంతులు 
ఫలము తరువులు 
దూసిపోసే నిల ఉమా!

ఎలుగు బంటది 
పట్టు కుంటది 
తేనె తింటది 
చీమపుట్టలు తినె ఉమా!

చిరుత పులులవి 
చురుకు కనులవి 
వేట కొడుతవి 
గుహల లోపల బస ఉమా!

పుట్ట లుండును 
పాము బుసలును 
అడవి తేళ్లును 
భయం మస్తుగనే ఉమా!

అడవి మంచిది 
ఫలము లిస్తది 
నరకకుంచది 
వానలిచ్చును మరి ఉమా!



కామెంట్‌లు