జీవనసౌందర్యాలు(నానీలు)--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
1.సేవతో చేసే 
   చిన్ని సాయమే
   మానవ జీవన‌
   సౌందర్యానికి గుర్తు.

2.నిరాకారమైన
   ఆత్మావలోకనమే
   అసలు సిసలు
   అందం.

3.నిష్కల్మషమైన
    హృదయానికే
    నిత్యనీరాజనాల
    సొగసులు.

4.నిరాడంబరత
   నియమం
   నీ ఆత్మసౌందర్యం
   దేదీప్యమానం.

5.అందమైన గుణం
   కనబడుతుంది.
   ఎన్నో దీపాలను‌
   వెలిగిస్తుంది.

6.సంపదలు 
   అధికారాలు భ్రమ.
   సుజన సౌశీల్యాలు
   సౌందర్యాలు సత్యం.

7.శ్రమశక్తితో
   జీవించు
   నీ మోముపై తరగని
   సౌందర్యముదయించు.

కామెంట్‌లు