అటు --ఇటు ...!!:-------డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హన్మకొండ .

 చుట్టూ రా ఉండే 
ప్రకృతి సౌంధర్యం .....
ప్రతిక్షణం ---
చూచి ..చూచి 
చికాకేస్తుంటుంది !
కష్టపడితే ....
కాళ్లదగ్గరకు వచ్చిపడే 
సౌకర్యాలు ....
ఏక్కడో ఊహించుకునే ,
అతిశయోక్తులముందు ,
వెలిసిపోయిన ...
రంగుల చిత్రాలవుతాయి !
అయినవాళ్లమధ్య 
తిరుగుతూ ....
ఆదర్శంగా బ్రతకగల ,
వెసులుబాటు వదిలిపెట్టి 
వంటరి జీవితాలతో ,
చిత్రంగా బ్రతికే ...
సుదూర తీరాలవైపు 
మనసు మళ్లిపోతుంటుంది !
వెనక్కి తిరిగి చూసుకుంటే ,
మనలోనే మనమేదో 
కోల్పోయిన భావన !
ఆశలు ..నిరాశలై ....
చివరకి మిగిలేది --
అంతు లేని ఆవేదన
అదుపు చేయలేని రోదన..!!

కామెంట్‌లు