అడవి తల్లి అందాల బిడ్డలం!
ప్రకృతి మాత బంగారు పిల్లలం!
కాసింత వానకే రెమ్మలు తొడిగే చెట్టులం
కలకాలం మధుర పళ్ళనిచ్చే చెట్టులం
కడుపునిండా మంచి తిండి పెట్టే చెట్టులం
కంటి నిండా కమ్మని నిద్రానిచ్చే చెట్టులం
పళ్ళు తోముకునే వేప ఫుల్లలం
అతికించే జిగురునిచ్చే తుమ్మబంకలం
ఉయ్యాలలూ గేలా ఊడలు నిచ్చే మర్రి వృక్షాలం
మెత్తని పరుపునిచ్చే పత్తి కాయలం
ఘాటైన పరిమాలనిచ్చే సంపెంగలం
మత్తు ఎక్కించే వాసన గల మొగలిరేకులం
కడుపును చల్లబరిచే తాటి ముంజలం
ఎండలో దాహం తీర్చే కొబ్బరి బొండాలం
వ్యాధులకు మందులనిచ్చే సంజీవని మొక్కలం
బుద్ధుడికి జ్ఞానోదామయ్యే బోధి వృక్షాలం
కోరిందల్లా తెచ్చివ్వగలిగే కల్పతరువులం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి