*చేరువైనా... దూరమైనా*..:--లీలా కృష్ణ.
చేరువ నుండి పుట్టినదే దూరమనే పదం..
దూరం జరిగే కొద్దీ..  కొత్త దోవని చేరగలం..!!

ఆది, అంతం ఎరుగనిదే ఈ విశ్వం..!!
దూరమని , దగ్గరని.. నువ్వు అంటుంటే..
నవ్వకెలా ఉండగలదు శూన్యం.

విత్తు నుండి చెట్టు మొలిచెనని..
నిరూపించుటకై దరి చేరలేదు ఏ సాక్ష్యం.
చెట్టు నుండి విత్తు రాలిందనే నిర్ధారణకు రాలేకపోయెను..
ఏ సుదీర్ఘ అధ్యయనం.

మిన్ను నుండి దూరమైన
వాన చినుకు కథ..
మన్ను చేరకుండా..
పరిపూర్ణత పొందగలదా..!!

ఆషాడమొచ్చి దూ

రమైన..
నవదంపతుల వ్యధ.
తిరిగి శ్రావణాన్ని చేరకుండా ఉండగలదా..!!

ఎటువంటి బంధాలను దరిచేరనివ్వక..
ఎంతటి దూరాన్ని అయినను, పశుపక్ష్యాదులు.. ఇష్టపూర్వకంగా చేరుచుండగా..!!

తెలివైన జాతి అని పిలవబడుతున్న మానవులు.. ఎందుకు తమ నిజమైన స్వేచ్ఛకు దూరమై..
చింతలకు చేరువవుతున్నారు.. బ్రతికుండగా..!!