రంగు రంగుల చిలక (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
రంగ రంగుల చిలకండి
నిమ్మలంగా చూడండి
గమ్మున మీరు ఉండండి
దయతో దాన్ని చూడండి

రమ్యమైన చిలకండి
బొంగరమోలె ఉందండి
మట్టి కలర్ ముక్కండి
చక్రం లాంటి కళ్ళండి

పచ్చ రంగు తోకండి
కుచ్చుల వలె ఈకలు
చక్కనైనది ఆ చిలక
రెక్కలు విప్పి లేసింది

గాయి గాయి చేసింది
ఎంతో ఎత్తు కెగిరింది
నింగి మీదికి చేరింది
నేలను చూసి నవ్వింది