పెద్దల మాట(బాల గేయం): -ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
భగ భగ మండే భానుడు
బిరబిర తిరిగే కరోనా
పిల్లలు పెద్దలు వినరండి
జాగ్రత్తగా మీరు ఉండండి

గుంపులుగా ఆగొద్దు
వీధుల వెంట తిరుగొద్దు
ఎండ వేడి తగులుతుంది
కరోనా పురుగు కాటేస్తుంది

దూర దూరంగా ఉండండి
మాస్కు తప్పక పెట్టండి
జాగ్రత్తలను పాటించండి
జనాలలో తిరుగొద్దండి

ఆరోగ్యమే మహాభాగ్యమని
పెద్దలు ఎప్పుడు అంటారు
పెద్దల మాట సద్దన్నం మూట
ఆ మాటనే జీవిత పూల బాట