మనసు - బాల గేయం: --ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.
మనసు మనిషికి సర్వము 
మనసు ఊహల రూపము 
మనసు సుందర స్వప్నము 
మనసు బాధల కూపము !

మనసు శిశువుకు సైతము 
మనసు యువతకు తేజము 
మనసు వృద్ధుల ధైర్యము 
మనసు దేవుని నిలయము!

 మనసు అమ్మకు ఘనము 
మనసు మాటను వినుము 
మనసు నిలుపు కార్యము 
మనసు అదుపు ధర్మము !

 మనసు ఈసుకు స్థలము 
మనసు జాలికి స్వరము 
మనసు కోపము కఠినము 
మనసు నిర్మల భావము !

 మనసు కోరును ప్రేమము 
మనసు వీడును సహనము 
మనసు ఉంచుము శాంతము 
మనసు మంచికి స్నేహము !

 మనసు వేడుక మధురము 
మనసు మిత్రుని సమము 
మనసు కవితల స్వర్గము 
మనసు గీతా మార్గము !!