ఏకపది:(నిశ్చితార్థం)*******1.ఇద్దరిని కలిపేందుకు....పెద్దలు ఏర్పరిచిన నాందీ,ప్రస్తావన!2.తాంబూలాలు ఇచ్చి,ఇరుకుటుంబాలు....ఖాయం చేసుకొనే సంప్రదాయం!ద్విపది:(నేటి పెళ్ళిళ్ళు)*******1.ఆడంబరాలు,అధిక ఖర్చులతో వృధా వ్యయం.వేడుకలపై మోజు,ఆచారాలకు బూజు.2.పెళ్ళిమంత్రాలు,తంతు అనవసరం.కట్నాలు పెట్టి,భోజనం ముగించి సరిపెట్టే వ్యవస్థ.త్రిపది:(ప్రేమ వివాహాలు)******1.మొదటి చూపులోనే ప్రణయోదయం.ఆకర్షణ వలల్లో ఇరువురూ ఖైదే.శారీరకంగా దగ్గరయినా,మానసికంగా దూరమే అవుతున్న విఫలప్రయత్నాలు.2.డబ్బు,అందాలే బాహ్యాకర్షణలు.అర్థం చేసుకోక,అవగాహనారాహిత్యంతో మూణ్ణాళ్ళముచ్చటలు.మిగిలిపోతున్న అపార్థాలు,పెరుగుతున్నవిడాకులు.
అక్షరమాలికలు:-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి