వ్యాధికి తగిన మందు:--.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


 అమరావతి నగరంలో తనఇంటి అరుగుపై నీతికథ వినడానికి చేరిని బాలలు అందరికి మిఠాయిలు పంచిన బామ్మ'బాలులు వృత్తి పరంగా ఎవరి పని వారే చేయాలి లేకుంటే ప్రమాదం.అనేకథ మీకు చెపుతాను వినండి.

అడవిలో ఏజంతువుకు ఎలాంటి ఆనారోగ్యం కలిగినా నక్కమామ వైద్యం చేస్తుండేవాడు అతనికి సహాయంగా కోతి బావ ఉండేవాడు.

ఒక రోజు నక్క మామ వద్దకు  ఏనుగు తాత వచ్చాడు'నాకు మోకాళ్ల నొప్పులు'అన్నాడు.పరిక్షించిన నక్కమామ 'వయసుకు తగినట్లు శరీరం బరువు తగ్గించుకోవాలి ఆకుకూరలు బాగాతినాలి,నొప్పి ఉన్న దగ్గర మునగఆకు వేడి చేసి ఉదయం సాయత్రం కట్టుకట్టండి-లేదంటే పొట్టు వలచిన చింతగింజల గుజ్జుతో కట్టు కట్టండి తగ్గిపోతుంది'అన్నాడు.

మరు దినం గుర్రం అన్న వస్తూనే 'అయ్యా నిన్నటినుండి విరేచనాలు ఆగకుండా అవుతున్నాయి'అని నీరసంతో కూలబడ్డాడు.లేహ్యాన్ని ఆకులో పెట్టి ఇస్తూ' కొద్దిగా రెండు పూటలు తీసుకో వేడినీళ్లు మాత్రమే తాగు'అని చెప్పి పంపించాడు.నక్కమామ.

ఒకరోజు తమ బంధువుల ఇంట శుభకార్యానికి వెళుతూ'కోతిబావ రెండు రోజుల్లో వస్తాను'అని చెప్పి వెళ్లాడు నక్కమామ.

ఇదంతా చెట్టుపై నుండి గమనిస్తున్న పిల్లరామచిలుక కొతిబావను చూస్తూ'యాత్ర వైకుంఠ మాత్ర నిచేతి బావకోతి'అంది.'ఏమిటి నాచేతిమాత్ర వైకుంఠయాత్రా? నేను వైద్యుడిని అవతున్నానని  అసూయ'అన్నడు కోతిబావ.

ఇంతలో కడుపునొప్పి తో బాధపడుతూ ఎలుగుబంటి బాబాయి అక్కడికి వచ్చాడు.నాడి పరిక్షిస్తూ 'ఏమిటి సమస్య'అన్నాడు కోతిబావ.

'అయ్య నదికి కొత్త నీరురావడంతో చాపలు బాగావచ్చాయి.బాగా ఉన్నాయి అని నాలుగు చేపలు ఎక్కువ లాగించాను కడుపు నొప్పిగా ఉంది'అన్నాడు. నక్కమామ కడుపు నొప్పికి ఇచ్చే మందు సీసా ఖాళీగా ఉండటంతో  చేతికి అందిన సీసాలోని లేహ్యం ఆకులో పెట్టి ఇస్తూ'రెండు పూటలా తీసుకో వేడినీళ్లేతాగు 'అని చెప్పి ఎలుగు బంటిని పంపించాడు.'సరి నీపని సరి''గోవిందో గోవిందా! నారాయణా!'అని అరవసాగింది పిల్లరామచిలుక.పిల్లరామచిలుకను వెక్కిరించాడు కోతిబావ.

రెండోరోజు ఉదయం నక్కమామ వచ్చేసరికి కోతిబావ నిద్రిపోతూ కనిపించాడు.ఇంతలో ఎలుగుబంటుని నులకమంచంపై వేసుకుని నాలుగు ఎలుగుబంట్లు మోసుకువచ్చాయి.'గోవిందా గోవిందా!'అరవసాగింది పిల్లరామచిలుక. 'ఏంజరిగింది'అన్నాడు నక్కమామ.

 ' మంచంలోని ఎలుగు బంటి కడుపునొప్పి అని వచ్చాను మందుఇచ్చాడు కోతిబావ అంతకుముందు మాములుగా విరేచనాలే అవుతున్నాయి కోతిబావ ఇచ్చిన మందు తిన్నాక తిన్న చేపలు అలానే పడుతున్నాయి'బావురుమన్నాడు ఎలుగుబంటి బాబాయి.   .'ఏంమందు ఇచ్చావు'అన్నాడు నక్కమామ. అప్పుడే నిద్ర లేచి వచ్చిన కోతిబావ ఆసీసా చూపించాడు.

'భయపడక ఇదిగో మెంతులపొడి పెరుగులో కలిపి మూడు పూటలు తీసుకో' కోతిబావ తెలియక నీకు విరేచనాలు అవడానికి మందుఇచ్చాడు'అని మందు ఇచ్చి ఎలుగుబంటిని సాగనంపింది.వెళుతూ బలంగా లాగిపెట్టి తన శక్తికొద్ది ఒతన్ను కోతిబావ పిర్రపై కసితీరా తన్ని తనవాళ్లతో కలసి వెళ్లాడు ఎలుగుబంటి బాబాయి.

దెబ్బకు బల్లిలా చెట్టుకు అంటుకున్న కోతిబావను చూస్తు పిల్లరామచిలుక 'అయిందా పెళ్లి కుదిరిందా తిక్క'అంది.'కోతిబావ తెలియని వైద్యం ఎంత ప్రమాదకరమో తెలిసి తెలియని పనులు చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.ఆరోగ్యం బాగాలేనప్పుడు వైద్యుని వద్దకు వెళ్లాలి అంతేకాని సొంతవైద్యం చేసుకోవడం, ఎవరు చెపితే వారి సలహా తో తప్పుడు మాత్రలు మింగితే చాలాప్రమాదం'వైద్యుని సలహామేరకే మందులు వాడాలి అప్పుడు ఎటువంటి సమస్యలు తలఎత్తవు'అన్నాడు నక్కమామ.

బాలలు కథ విన్నారుగా! ఎన్నడు సొంత వైద్యం చేసుకోకండి.అన్నదిబామ్మ.బుద్దిగా తలఊపారు పిల్లలు అందరూ!.