రామ నవమి : జగదీశ్ యామిజాల
విష్ణువావతారాలలో
విశిష్టమైనదీ
ధర్మస్వరూపమైనదీ
రామావతారం

మనిషిట్టా బతకాలనేందుకు
ఆదర్శప్రాయుడైన రాముడి కథనమే
ప్రత్యక్షసాక్ష్యం

రాముడు అవతరించిన రోజే
రామనవమిగా 
మనమందరం జరుపుకోవడం

ధర్మపరాయణుడైన రాముడి
అడుగుజాడలే 
మనందరికీ అనుసరణీయం

రామపట్టాభిషేక పటానికి
పూజించడంతో సరిపెట్టుకోక
కమనీయమైన రామాయణ కావ్యాన్ని 
పారాయణ చేసి
రాముడి అనుగ్రహానికి పాత్రులై
యోగక్షేమాలు పొందాలి

రామనామాన్నే
శ్వాసగా ధ్యాసగా
చేసుకుని జీవితాన్ని సాగిస్తే
అహంకారం నశించి
ప్రేమా జ్ఞానమూ వృద్ధి చెందుతాయి
ప్రశాంతత సంతోషం నెలకొంటాయి