మర్యాద:-తమిళమూలం - కణ్ణదాసన్:-అనుసృజన - యామిజాల జగదీశ్
 నా భవనంలో డబ్బుకి మర్యాద లేదు. 
బంగారం, వజ్రం ఇక్కడ ఉండటం లేదు.
మేధావుల వద్ద మాత్రమే డబ్బు కలిసొస్తుందంటే దానికి నేను విలువిస్తాను. 
బుట్టలూ తట్టలూ మోసేవారూ
చెత్తకుప్పలు ఏరే వారూ లక్షల్లో డబ్బులు కూడబెట్టగలరంటే నాకెందుకా డబ్బు?
స్వీయగౌరవం కోల్పోయిన ఆ డబ్బు 
నా నుంచీ గౌరవాన్ని పొందలేదు.