అందిన ఆనందం...!!:- ----ఆన్షి .నల్లి హన్మకొండ .


 బొమ్మలు ..బొమ్మలు 
భలే ..భలే ..బొమ్మలు 
అందమైన బొమ్మలు 
ఆడుకునే బొమ్మలు 
అమ్మకొన్న బొమ్మలు 
అమెజాన్ బొమ్మలు 
పుట్టిన రోజున 
పెద్దలిచ్చిన -
గిఫ్టు---బొమ్మలు ....!
అమ్మకు చిన్నపుడు 
అసలు లేవట బొమ్మలు ,
మామకూడా -అమ్మలానే 
బొమ్మలతో ఆడలేదట 
తాత --అమ్మమ్మ 
బొమ్మలేమీ కొనలేదట !
అమ్మకు వీలుకాని 
సరదాలెన్నో ...
నా ద్వారా తీర్చుకుంది ,
నాకెన్నో బొమ్మలు కొనిచ్చి 
ఆడుకోమంటుంది హాయిగ !
అమ్మా ...నీకు వందనం ,
బొమ్మలతో ఆడుకుని 
అందిస్తా నీకు ఆనందం ...!!
        
కామెంట్‌లు