పిచ్చుకలు -మొగ్గలు :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
పొద్దున్నే కువకువ లాడుతూనే 
వాకిట్లో సందడి చేస్తాయి పిచ్చుకలు!
వేలెడు పక్షికి వెలకట్టలేని అందం !

జంటగావచ్చి ఇంటిచూర్లు  కిటికీల్లో 
పుల్లలూ పుడకలతో ముచ్చటయినగూడు!
గుడ్లుపెట్టి పొదిగి పిల్లల్నిచేస్తాయి!

కుటుంబ సందడికి ఆదర్శంగానే 
ఆహారం తెచ్చిపెట్టే మురిపాలు 
కిచకిచల బుల్లినోర్లు సంతోషం!

రెక్కలొచ్చే వరకూ సాకుతూనే 
ఎగిరిపోతే చింతలేదా  జంటకు 
జీవధర్మం తీర్పు ఇదేనేమో !

సెల్ టవర్ రేడియేషన్కు పారిపోతూనే 
ఆహార అన్వేషణలో తరచుదర్శనం!
వరండాలో వరికంకులుకట్టి స్వాగతమిద్దాం!


కామెంట్‌లు