'సర్వేపల్లి'... :- ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య


 చాయ్ ల చక్కెర తక్కువ వేయమని చెప్పాను కదరా! అక్కడ చెప్పాలేదాఏం? చక్కెర ఎక్కువ అయింది. నేను చెప్పాను సార్.. చక్కెర తక్కువ వేయమని.. మా సార్ కు షుగర్ ఉందని.. చెబితే తీయగా అయింది ఏమి రా.. అని బిక్షపతి తో అనగానే.... నేను అక్కడే ఉండి చాయ్ చేయించుకుని వచ్చాను సార్ అన్నాడు బిక్షపతి. బిక్షపతి 5వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు నేను ప్రాథమిక పాఠశాల గణపురంలో ప్రధానోపాధ్యాయులు గా ఉన్నాను. చాయ్ తాగి గిలాస పక్కనబెట్టి-నేను షుగర్ పేషెంట్ కదరా... చక్కెర ఎక్కువ అయితే... అక్కడనే పడిపోతూ తెలుసా అని, బిక్షపతి తో అనగానే-మేము లేమా  సార్. సర్వేపల్లి రాధాకృష్ణన్ ను బండి మీద ఎక్కించి క పోయినట్లే... మిమ్ములను ఎక్కించిన పోతాము. మా 5వ తరగతి వాళ్లము అంతా బండి లాగుతూ దవాఖాన కి తీసుకెళ్తాం. అన్నాడు. ఆ మాటతో నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిండాయి. తరగతి ఐదు అయినా... వయస్సులో కొంత పెద్ద వాడే బిక్షపతి.