పిల్లలు జాగ్రత్త:- కవిత వేంకటేశ్వర్లు
పండుగ వచ్చే పిల్లలు
కురిసే ఆనంద జల్లులు
అమ్మా చేసే పిండి వంటలు
అరగించి ఆడుదాం ఆటలు

వేసుకుందాం కొట్టబట్టలు
బట్టలలో పంచాడు నాన్న  ప్రేమలు
సెకెండ్ వేవ్ వచ్చింది కరోనా
రౌ0డప్ చేస్తుంది మెలమెల్లన

పాటించాలి జాగ్రత్తలు
వినాలి అమ్మ చెప్పిన మాటలు
బయటకు పోకుండా ఇంట్లోనే
ఆటలాడాలి
అందరితో కలువకుండ ఒంటరిగానే ఉండాలి

పకింటికి ఎదురింటికి పోకు
అన్ని కోరికలకు వెయ్యాలి బ్రేకు
మానుకోవాలి బజార్ సోకు
భయపడి బతకాలి కరోనాకు

కనపడని క్రిమి అది
కరుణలేని శిల అది
పట్టుకుంటే ప్రాణం తీస్తది
జాగ్రత్తగుంటే దూరం పోతది
అందుకే పిల్లలు మీరంత జాగ్రత్త
దాని జోలికి పోకండి అది కాదు
మీ మేనత్త!!