మార్పు లేని ఉగాది ఆ.వె.పద్యాలు: --వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్, సిద్దిపేట.

 8⃣2⃣1⃣
ఉన్న వారికేమొ ఊరంత పండుగ 
లేనివారికేమొ లేక బాధ 
పండుగ సమమైన పాట్లేను వేరయా 
పండుగొచ్చినంత ఫలముయేమి 
8⃣2⃣2⃣
సిరయునొకటె గాని సీసాలు వేరయా 
సీస మారినట్టు సీను మారె 
ప్రభుత లెన్ని మార ప్రజల బ్రతుకు మార్చ పన్కిరాని మార్పు ప్రభవ మాయె 
8⃣2⃣3⃣
పండుగలును వచ్చు పరమ సంతోషము 
పథకములునుదెచ్చు ప్రభుత నేడు 
పనికిమాలినట్టి పథకాలుయేలరా 
నడ్డి విరిచినట్టి నాటకములు 
8⃣2⃣4⃣
నాటి యుగము నుండి నేటివరకుయెంత 
మార్పుయేమి కలిగె మహినిలోన 
పేదవాని బ్రతుకు పెంట కుప్పలవలె 
పెరుగుతున్నదదియు పేదరికము 
8⃣2⃣5⃣
ఉన్న వాడి బ్రతుకు ఉన్నతముగయుండె 
దోపిడంత జేయ దొరతనంబు 
పదవి పొంది నోడె ప్రజల కంటకుడాయె  
ప్రజల ముంచి నోడె పచ్చ గుండె