మెరుగైన సమాజము
కావాలని తలచెను
ప్రజాస్వామ్య సూత్రాలు
జన క్షేమ కోసమనెను
వారెవ్వా అంబేద్కర్
అనిర్విరామ కృషి చేసేను.
కులమత తేడావద్దని
సమానత్వ కాంక్షతో
సమాజ నిర్మాణానికై
మానవత్వ మెరుగులతో
అవసరమైన రాజ్యాంగంను
అందించెను అంబేద్కర్.
నిర్థెశించిన లక్ష్యంన
ప్రభుత్వేర్పాటుతో
చట్టముందరు ఒకటని
రచించెను సమర్థతో
వారెవ్వా అంబేద్కర్
అందరికీ ఆదర్శమయ్యెను.
ప్రజాస్వామ్యమై నిలిచె
ప్రపంచ శాంతి కోసము
మహోన్నతంగా వెలిగే
మానవాళి సంక్షేమము
వారెవ్వా ఉద్దేశ్యాల తీర్మానంతో
అందరికీ మేలు చేసే అంబేద్కర్.
అతి పెద్ద ప్రజాస్వామ్యము
లిఖిత రాజ్యాంగమది
దేశానికి అంకితమే
సర్వ సత్తాకమైనది
శాంతి యుతమైనది
అంబేద్కర్ పుణ్యఫలమది.
రాజ్యాంగ రచనము
సర్వ శక్తుల కార్యమది
డ్రాఫ్టింగ్ కమిటి కృషి
యజ్ఞమై కొనసాగినది
వారెవ్వా రాజ్యాంగ సభ
రాజ్యాంగానికి ఆమోదం తెలిపే.
అందరు మెచ్చిన రచన
దేశమంత ఆనందము
అత్యంత విశిష్టతున్న
రాజ్యాంగ రచన మనది
వారెవ్వా కార్యశీలుడు
అంబేద్కర్ అభినందనీయుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి