భక్తి మంచిమార్గాన్నిచూపుతుంది. బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్


 అమరావతి నగర సమీపంలోని అరణ్యంలో నీరు లభించకపోవడంతో జంతువులన్ని కృష్ణానది ఎగువ ప్రాంతానికి తరలి వెళ్ళసాగాయి.  ప్రయాణంచేసి విశ్రాంతికొరకు పెద్దమర్రిచెట్టుకింద ఆగాయి."తాత కథఏనుగు మంచి చెప్పు ఏదైనా"అంది పిల్లరామచిలుక. "తప్పు పదాలు అలా వెనుకముందుకు మార్చి మాట్లాడకూడదు. ఏనుగుతాతఏదైనా మంచికథచెప్పు అనాలి"అంది తల్లిరామచిలుక. "ఒహో ఏనుగుతాత కథ చెప్పబోతున్నాడు అందరు వినండి"అనిఓండ్రపెట్టాడు."చీమ తనకోరిక ఎలాతీర్చుకుందో కథారూ పంలో మీకు తెలియని కొన్ని మంచిమాటలు చెపుతాను.భక్తిమార్గాన్ని పోతనా మాత్యులు తొమ్మిదిరకాలుగా చెప్పాడు.పతాంజలి యోగశాస్త్రంలో అహింస,సత్యం,అస్తేయం,బ్రహ్మచర్యం,అపరిగ్రహం అనేవి యమాలు గా.శౌచం,సంతొషం,తపస్సు,స్వాధ్యాయం,ఈశ్వర ఫణిదానం అనేవినియమాలనిచెప్పాడు.అలాగేపూజ రెండువిధాలు .బాహ్యపూజను బహిర్యాగం అని,మానసికపూజను అంతర్యాగం అనిఅంటారు ఏపుష్పమైనా కొంత సమయంతరువాత వాడిపోతుంది కాని పుట్టుకతో  వచ్చే అహింస,ఇంద్రియనిగ్రహం ,సర్వప్రాణులఅందు  భూతదయ,క్షమ,జ్ఞానం,ధ్యానం,తపస్సు,సత్యవ్రతం వంటివిచాలా గొప్పప్పవి. ఆసక్తిఉంటే ఏమంచిపనితలపెట్టినావిజయవంతంఅవుతుంది. భక్తికితొలిమెట్టు ఆసక్తి.       

                     సక్తి గలుగు పనులు చక్కగా నెరవేరు

                       భక్తిగలుగు పూజ ఫలము నిచ్చు .,

                        యుక్తి కలుగు మాట యొప్పునురా భువి,  

                       విశ్వదాభి ామ వినుర వేమ !

శ్రీకాళహస్తి లోని పురాణకథలో సాలెపురుగు.పాము. ఏనుగు ఆశదాశివుని ఎలా పూజించాయో అలాగే ఓచీమ తను కాశీలో జన్మించి గంగా జలంలో తడిసి శివుని దర్మనం చేసుకోవాలని సంకల్పించి  తనకుసమీపంలోని నందివర్దనం చెట్టుచేరి ఓపువ్వులో దాగిఉంది.ఎవరో భక్తులు ఆపువ్వులను కోసుకొని బుట్టలో పెట్టుకుని శివాలయం చేరేలోపు వాడిపోకుండా శివుని అభిషేకిద్దాం అని తనవెంటతెచ్చుకున్న గంగాజలాన్ని ఆపూలపై చిలకరిస్తూ శివాలయం చేరిన ఆభక్తుడు శివుని అభిషేకించి,తనుతెచ్చిన పూలను శివలింగంపై ఉంచాడు ఆభక్తుడు.చిమ గంగా జలంలో తడవడం,శివుని చెంతచేరడం అలాజరిగిపోయాయి. బాలలు ఏదైనా సాధించాలి అంటే పట్టుదల.సహనం.కృషి.ఓర్పు. నేర్పు.ఆసక్తి .ఉండాలి .