ఆనంద గీతం !!:-కె ఎస్ అనంతాచార్య
 నాకు నచ్చేవి 
నేను మెచ్చేవి మాత్రమే నావి 
వేదికలు, వేడుకలు ఎక్కడైనా సూటితనపు 
సూదినే  
నిలబడ్డా  కూర్చున్నా 
నిందేల పిందేల తెంపి నిజం నిప్పుల్లో పుటం పెడుత 
గుంపుల్లో, ఒంటరీలో  ఒక్క మాటను మూటగట్టుకున్న ఆత్మశక్తి బాంబునే
నేను మనిషి అచ్చులు పోసుకున్న కుచ్చులకు ఎప్పుడూ దూరమే 
దాచిపెట్టుకున్న చేతులు   విరిచిన అక్షరాలు 
దయతలపని పనులు ఎండిపోయిన ఊహాలు అన్నీ నాకు చిరిగిన దుస్తులే
నలుపును చేరపటానికి తెల్లటి పావురాలు రాసిన
శాంతి పాఠం కంఠం లోంచి సుప్రభాతo
బెజ్జం లో దూరిపోయిన సూత్రానికి జారిపోయిన ఆశలకు ప్రాణం పోయాడానికి మనసు పైన  
పొసే రంగుల అల్లికలు 
 శ్రమించటం తప్ప కుదురుగ కూర్చొని మెతుకుల వాసన ఆఘ్రాణించలేని రైతు నాసికల మీద  భరోసా పరిమలాలు
మాసిపోయే బాల్యానికి
మాసికలు వేస్తూ పెత్తనాన్ని భుజానవేసుకొని మోసే 
 మీసాలు  
ఎన్నో కొన్ని కలసిన ఆలోచనలును  అంటిపెట్టుకున్న తలలకు  బోనం ఎత్తే  సంస్కృతి
కూలిపోతున్న భాషా శిఖరం మీద కొత్త జండా  పాతే తెలివి తరం చేసే తెలుగు సాహసం
అన్నింటిని  ప్రేమిస్తా  పూవునై  గుభాలిస్తా
 నేను ఎక్కడైనా  లేజర్ నే మోసాన్ని మోసే చీకటిని 
కోస్తుంటాను
మాటలు తప్పి తిరగబడే
నాలికలకు మందు వేస్తాను
అసమానతల  సరి చేయడానికి  మిషన్ హృదయ సంస్కార్ ని అవిష్కరిస్తా
లోపం పసిగట్టి లో లోపల మసలిన  కోపం పొంగును
అమ్మ కొంగుకు ముడివేస్తా
ఆత్మీయ ఆలింగనం తో
ముఖం మీద చిరునవ్వు నై
ఆనంద గీతం ఆవిష్కరిస్తా