పిల్లలు కాదు పిడుగులు
అల్లరి తోడుగా అడుగులు
మాటలు విననే వినరు
మారాం చేయటం ఆపరు
బొమ్మలొద్దు గిమ్మలొద్దు
ఆట పాటలు అసలొద్దు
ఒక్కసారి మాటవినాలంటే
అరచేత అమిరే సెల్లే ముద్దు
సెల్లులు వచ్చాక పిల్లలు
యూ ట్యూబ్ కు గమ్ లు
డైనో లా అరుపులు
సింగంలా గెంతులు
బేర్ బ్రదర్స్ సరదాలు
ఓగ్గీ కాక్రోచ్ క్రేజులు
డార్క్ ఫేంటసీ టేస్టులు
ఐస్ క్రీమ్ లకే ఇష్టులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి