కుక్కను కొడితేడబ్బు- బెల్లంకొండనాగేశ్వరరావు.

 అమరావతి రాజ్య పొలిమేరల లోని అరణ్యంలో నీరు లభించక జంతువులు అన్ని కృష్ణానది తీరంవెంట ఎగువ ప్రాంతానికి తరలివెళ్ళసాగాయి. కొంతసేపటి తరువాత "ఏనుగు అన్నాప్రయాణంలో అలసట తెలియకుండా ఏదైనా మంచి కథ మాఅందరికి చెప్పు"అన్నాడు గుర్రంమామ."ఓహా ఏనుగుతాత జంతువులను ఓపెద్ద చెట్టుకింద సమావేశపరచి" మనుషులు మాటలసందర్బంగా కుక్కను కొడితేడబ్బు అంటూఉంటారు ఆమాట ఎలాపుట్టిందో చెపుతాను వినండి.పూర్వం మనరాజ్యపొలిమేర్లలో చొక్కరాతి శివయ్య అనే యువకుడు నివసిస్తుండేవాడు తనకు ఎవరులేక పోవడంతో  తనకుఉన్నపొలంలోనే యిల్లు నిర్మంచుకుని ఆదరణలేని కొందరు వృధ్ధులను,బాలలను చేరదీసి వారికిభోజన వసతి సదుపాయాలు కలిగించాడు,ఇతని చేస్తున్న మంచిపనికి ఆపరిసర ప్రాంతాలలోనివారు తమకుతోచినసహయం అందిస్తూ ఉండేవారు.యిద్దరు దొంగలు ఓకరోజు పొరురాజ్యంలో దొంగిలించి నగలు,ధనం మూటకట్టుకుని రాత్రంతాప్రయాణంచేసి వస్తూ శివయ్య యింటికి కూతవేటు దూరంలోకివచ్చి తాము దారిలోసేకరించూకున్న మాంసాహరాన్నినిప్పులపై కాల్చుకుని దాన్ని బంగారం ధనంఉన్న మూటలో దాచి,మూటను అక్కడేఉంచి ,కొద్దిదూరంలోని వేపచెట్టు పుల్లలు రెండు విరుచుకుని పక్కనేఉన్న వాగువద్దకు చేరి దంతాలు శుభ్రపరుచుకోసాగారు. కాల్చిన మాంసం వాసనకు వచ్చిఒకుక్కమూటకు దగ్గరగాను వాసనచూడసాగింది.అదిగమనించిన దొంగ కుక్కపైకి అందుబాటులోని రాయి విసిరాడు, రాయిని తప్పించు కున్నకుక్క ఆమూటను నోటకరుచుకుని వేగంగా పరుగుతీస్తూ శివయ్య యింటి ముందుఉన్నతొటలోనికి వెళ్ళింది. కుక్కను కొందూరం తరిమిన దొంగలు రక్షకభటులు కనిపించడంతో చల్లగా జారుకున్నారు. కూరగాయలకొరకు తొటలోనికి వచ్చిన వృద్దురాలు చేతికర్రతో కుక్కకు ఒక్కటి తగిలించింది, అప్పటికే మూటలోనిమాంసం అంతా తిన్నకుక్క మూటవదిలి తొటవెలుపలకు పరుగు తీసింది.అప్పుడేవచ్చిన శివయ్య మూటవిప్పి బంగారునగలు,ధనంచూసి వాటిని న్యాయాధికారికి అప్పగించాడు.న్యాయాధికారి తమరాజుగారివద్దకు దాన్నిపంపించాడు.మరుదినం శివయ్యను పిలిపించిన రాజుగారు శివయ్యచెప్పినవిషయంవిని "కుక్కనుకొడితేడబ్బా"అని ఆశ్చర్యపోయి, ఆసోమ్ముకలవారెవరో వచ్చివారం రోజులలోగా  నిరూపించుకుని వీటిని  తీసుకు వెళ్ళవలసిందిగా  ఆరోజే తన రాజ్యం అంతాటా చాటింపు వేయించాడు. గడువుముగిసిపోవడంతో  శివయ్యను పిలిపించిన రాజుగారు "శివయ్య భళా నీ నిజాయితి మెచ్చదగినది,యిప్పటికే నీ పరోపకారగుణం సేవాభావం గురించి విన్నాను,నీలాంటి నిజాయితి పరులే మనదేశానికి వెన్నుముక లాంటివారు నిన్ను అభినందిస్తూ ఈమూట లోనిధనం నగలు నువ్వే స్వీకరించు,నీసేవలను మరింత పెంపొందించు నీకు కావలసిన ధనసహయం ప్రతి మాసం నీకుఅందేలా ఏర్పాటుచేస్తాను"అన్నాడురాజుగారు.ఆధనంతో రాజుగారి సహయంతొ శివయ్య ఎందరినో ఆదుకున్నాడు.  అలానాటినుండే కుక్కనుకొడితేడబ్బు అనే మాట పుట్టింది".అనిఏనుగు  తాత కథ  ముగించడంతొ జంతువులు అన్ని తమప్రయాణాన్ని కొనసాగించాయి.