కదిలే ..మేడ ...!!:---ఆన్షి.నల్లి హన్మకొండ .

 రెండంతస్తుల 
మేడచూసాను ,
కదలకుండా 
ఒక్కచోటే ఉండే 
నివాసభవనం అది !
రెండంతస్తుల 
బస్సువుండేదట 
అది వెళుతుంటే 
కదిలిపోతున్న 
మేడలా ఉండేదట 
ఊహిస్తుంటేనే ...
అబ్బురంగా ఉంది !
డబల్ డెక్కర్ బస్సు 
దానిపేరట .....
చదువుకునేప్పుడు 
మా తాత ....
భాగ్యనగరంలో 
ఈ బస్సులే ఎక్కేవారట !
డబల్ డెక్కర్ అనుభవం 
తాతవాళ్ళది .....!
అసలు బస్సు ఎక్కని 
అనుభవం 
మా ..తరానిది ....!!
      
కామెంట్‌లు