పంట చేను లో చిలకమ్మా
పారిపోకు నీవమ్మా
చేనుకు చెదలు పట్టింది
చెంగునెగురుతు రావమ్మా
చిలకల గుంపును పిలవమ్మ
చేనులో నీవు వాళ్ళమ్మ
పట్టిన చెదలను ఏరమ్మ
పొట్ట నిండా మెక్కమ్మ
పురుగుల బెడద తొలుగును
కాగులు గర్షెలు నిండగా
దేశ సంపద పెరుగును
రైతు ఎంతో మురుస్తాడు
రాజ్యాలన్నీ తిరుగమ్మా
రైతుకు తోడుగా నిలువమ్మ
రైతే రాజని చాటి చెప్పమ్మా