.పట్టుదల ..:--వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాసు, సిద్దిపేట.
పట్టుదలతో చదువవలెను 
పాఠములను నేర్వవలెను 
గురువుల మాటలు వింటూ 
ఉత్తమునిగ మెలగ వలెను 

సద్బుద్దులు కలిగియుండు 
సుగుణాలను పెంచుతుండు 
దుర్గుణాలను వదులు చుండు 
సత్వగుణము వృద్ధిచెందు 


జీవుల బాధించ బోకు 
చెడ్డ పనులు

జేయబోకు 
ప్రాణుల హింసించ బోకు 
పరులకు కీడు చేయబోకు 

చెడు తలంపులు మానుము
చెడు చేష్టలు మరువుము 
దుష్ట బుద్దులు తొలగించుము 
దుర్గుణాలు వదులుకోనుము