చీమలు చీమలు
ఎన్నో చీమలు
బారులు బారులు
ఎర్ర చీమలు
నల్ల చీమలు
గండు చీమలు
రంగుల చీమలు
రకరకాల చీమలు
తమాషాగా ఉన్నాయండి
ఎప్పుడు చూసిన
పనిచేస్తూనే ఉన్నాయండి
తనకంటే ఎక్కువ
భారము ఉన్నా
చిరాకు పడక
మోస్తాయండి
అలా పని చేస్తాయండి
చీమలు చీమలు
నడిచాయంటే
సైనికుల లాగా
బారులు బారులు
బారులు తీరి
నడుస్తాయండి
ఎక్కడ కూడా
వరుసలు తప్పి
నడవవు లెండి
భవిష్యత్తు కోసం
చీమలు అన్నీ
ఆహారాన్ని తాము
పొదుపు చేస్తాయండి
దాచుకుంటాయండి
మనకు పొదుపు నీతిని
ప్రబోధిస్తున్నాయండి !!
చీమల ప్రబోధం:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి