మారినరాముడు. :-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


 అమరావతినగరంలోని విశ్రాంతి అటవి శాఖాధికారిరాఘవయ్యతాతగారి ఇంటి అరుగుపై ఆవాడకట్టు లోని పిల్లలు అందరు కథవినడానికి చేరారు.పిల్లలు అందరికి మిఠాయిలుపంచిన తాతయ్య "బాలలు మీకు ఈరోజు చేసినతప్పు తెలుసుకొని మారిన విద్యార్ధి కథచెపుతానువినండి.

మనఊరికి పొరుగున ఉన్న గ్రామంలో రాముడు అనేవిద్యార్ధి ఉండేవాడు.

తనుప్రతిరోజు పాఠశాలకు వెళుతూ దారిలోని రామాలయం ముందు యాచనచేస్తు ఉండేతాతను తరచూ మోసగించి అతనిముందు గుడ్డపైన అర్దరూపాయివేసి"తాతా అయిదురూపాయలు వేసాను రూపాయియిచ్చి నాలుగు రూపాయలు తీసుకుంటున్నాను "అని చాలాసార్లు డబ్బులు తీసుకున్నాడు.ఆయాచకుడు కంటిచూపు లేకపోవడంతో జరుగుతున్న మోసాన్ని తెలుసుకోలేకపోఏవాడు.ఎప్పటిలా అర్దరూపాయివేసి అయిదురూపాయల చిల్లర జేబులోవేసుకుని వేగంగా పాఠశాల చేరుకున్నాడు.ఆరోజురాముడు చదివే ప్రభుత్వ పాఠశాలకు జిల్లాకలెక్టర్ వస్తున్నారు.పాఠశాల అభివృధ్ధికి లక్షరూపాయలు విరాళంఇచ్చిన వ్యక్తిని కలెక్టర్ గారు సత్కరించబోతున్నారు.పైగా విరాళం ఇచ్చినదాత ఓక విద్యార్ధిని దత్తత తీసుకుని ఆవిద్యార్ది చదువుకు అయ్యేకర్చు తను భరించబోతున్నాడట. పాఠశాలలో ప్రార్ధనాగీతం పాడిన కొద్దిసేపటికి కలెక్టర్ గారు రావడం,అలంకరించిన వేదికపై ఆయనతో పాటు ఊరి పెద్దలు ఆసీనులైనారు.రామాలయం వద్ద ఉండే చూపులేని యాచకుడిని కొందరు వ్యెక్తులు వేదికపైకి తీసుకువచ్చి కలెక్టర్ గారిపక్కన కూర్చోపెట్టారు.అక్కడ ఏంజరుగుతుందో రాముడికి అర్ధంకాలేదు.కలెక్టర్ గారు మాట్లాడుతూ "యాచనతో జీవించే ఈతాత మనపాఠశాలకు లక్షరూపాయలు విరాళం ఇవ్వడమేకాకుండా ఒక విద్యార్దిని దత్తత తీసు కోవాలి అనే నిర్ణంయం చాలాగోప్పది,ఇంతటిదానగుణం కలిగిన తాతను మాట్లాడవలసిందిగా కొరుతున్నాను"అని తనచేతిలోని మైక్ ను తాత చేతికి అందించారు."పెద్దలు అందరికి నమస్కారాలు,నాఅనేవారు లేనినాకు ఈఊరిరామాలయం చాలాధనం సంపాదించిపెట్టింది.ఆధనం ఈఊరేయిచ్చిందికనుక,అది ఈఊరికేదక్కడం న్యాయం.నేను ఓకవిద్యార్ధిని దత్తత తీసుకుంటున్నాను.ఆవిద్యార్ధి మీలో నేఉన్నాడు.తరచు నాకు రూపాయి దానంచేయడానికితరచు అయిదు రూపాయల బిళ్లవేసి నాలుగురూపాయలుతిరిగి తీసుకునే ఆవిద్యార్ధిని వేదికమీది రావలసిందిగా కోరుతున్నాను"అన్నాడు ఆయాచకతాత.వణికే కాళ్లతో తనుచేసిన తప్పుడు పనికి పశ్చాత్తాపపడుతూ,ఇటువంటి మహనీయుడికి  తను ద్రోహంచేసానే అనేబాధతో రాముడు వేదికపైకి వెళ్లాడు. కలెక్టర్ గారు రాముడు చేయి తాతకు అందించాడు."ఈబాలుడినే నేను దత్తతతీసుకుంటున్నాను.ఈబాలుడి చదువుకోవడానికి అయ్యే కర్చు అంతానేనేభరిస్తాను" అన్నాడు తాత. పాఠశాలప్రాంగణంఅంతా కరతాళధ్వనులతో మారుమ్రోగింది.కళ్లవెంటనీళ్లు కారుతుండగా "తాతామన్నించు నేటినుండి నేనే నీకు కళ్లుగా ఉంటాను" అని తాతకాళ్లపైవాలిపోయాడు రాముడు.

కథవిన్నారుగాబాలలు ఎన్నడు తప్పుడు ఆలోచనలు మనసులోనికి రానివ్వకండి"అన్నాడు రాఘవయ్యతాతయ్య.బుధ్ధిగా తలలుఊపారు పిల్లలు.