కష్టమైనా ..ఇష్టమైనది ..!!: - -----డా.కె.ఎల్.వి.ప్రసాద్-- హన్మ కొండ

 బాల్యం అందరికి 
ఆనంద సమయం కాదు ,
అందరూ ...
సిల్వర్ స్పూన్తో పుట్టరు ,
స్వేచ్చాజీవితం గడపరు !
కుటుంబవాతావరణం 
కలిసొస్తేతప్ప ....
కరుణించదు .....
కలిసిరాదు ....
బంగారుబాల్యం ,
దానికి నేను అతీతం కాదు !
పేదరికం తెరమాటున ,
పెద్దల క్రమశిక్షణ వాటున ,
కష్టించిపనిచేయడం ,
పెద్ద శిక్ష అనిపించేది ,
శత్రువుకు సైతం ...
ఈజీవితం ...
రాకూడదనిపించేది !
మంచి -చెడ్డలు 
తెలియని బాల్యమది ,
పిల్లల బంగరు భవితకోసం ,
' క్రమశిక్షణ 'అనేది 
పెద్దలువేసిన పునాదిరాయని 
అవగాహనకు రాని ,
గడ్డురోజులవి ...!
ఈరోజున నాబ్రతుకు ...
బాల్యంవేసిన మార్గంలో 
నడిచినందుకే .....
ఆనందంగా --
గడిచిపోతున్నది !
అప్పుడు పడ్డ కష్టమే ,
ఇప్పటిసుఖానికి -
మార్గదర్శనం చేసింది ,
నా ..తండ్రిని నిత్యం 
గుర్తుచేస్తున్నది ....!!
           
కామెంట్‌లు