అమరావతి నగరంలో నివసించే రైతు రాఘవయ్యచదువుకొలేదు.తనకుమారుడిని ఆంగ్లలో చదివించాడు.ఒకరోజు తనభార్యకు ఆరోగ్యంబాగాలేకపోవడంతో అర్దరాత్రి వైద్యశాలకు వెళ్ళాడు .వారు వెంటనే శస్త్రచికిత్సచేయాలి లక్షరూపాయలు కట్టండి అన్నారు.వడ్డివ్యాపరి రంగయ్య వద్దకు వెళ్ళి అతను యిచ్చిన డబ్బుతీసుకుని, రంగయ్య యిచ్చిన పత్రంపై తనువేలి ముద్రవేసి తనకుమారుడి చే సాక్షి సంతకం పెట్టించాడు. కొద్దిరోజుల అనంతరం న్యాయస్ధానంనుండి తనకుఆంగ్లంలో పత్రంరావడంతోఅందులోఏముందో చదవడానికి తనకుమారుడు ఊరిలో లేనందున, తనమిత్రుడు అయిన న్యాయవాది దుర్గరావు దగ్గరకు వెళ్ళి ఆపత్రంచూపించాడు."రాఘవయ్యనీపొలం రంగయ్యకు అమ్మినట్లుగా యిందులో ఉంది"అన్నాడు.జరిగినవిషయం వివరించాడు రాఘవయ్య."ఈరంగయ్యమోసాలకు అంతులేకుండా పోతుంది,ముల్లును ముల్లుతోనే తీయాలి.రేపుసాయంత్రం నాలుగు గంటలకురా రంగయ్యకు తగిన గుణపాఠం నేనునేర్పుతాను"అన్నాడు.రంగయ్యను రేపుసాయంత్రంసరిగ్గా నాలుగు గంటలకు రాఘవయ్య రాసియిచ్చిన పత్రంతో తనవద్దకు రమ్మని తన వద్దకు రమ్మని కబురుపంపాడు.దుర్గారావు. మరుదినం రంగయ్య,రాఘవయ్యలతో సమావేశమైన న్యాయవాదిదుర్గరావు రంగయ్య తెచ్చిన పత్రాన్ని పరిశీలించి "రాఘవయ్యగారు మీరు పూర్తిసమ్మతంతో రాసియిచ్చిన పత్రంయిది.పైగా మీకుమారుడు సాక్షి సంతకంచేసాడు"అన్నాడు చేతిలోనిపత్రంమడతపెట్టి బల్లపైఉంచాడు. యింతలో దబ్ మనే శబ్దం వినిపించింది .దుర్గరావుగారి పనిమనిషి పరిగెత్తుకువచ్చి"అయ్యగారు అమ్మగారు బావిలో పడ్డారండి"అంది ఆదుర్దాగా.అందరు బావి వద్దకు పరుగు తీసారు.వంటగది లోనుండి అందరికి కాఫీ తీసుకువస్తున్న దుర్గారావు భార్య"ఏమిటి అంతా బావిలో నికిచూస్తూన్నారు"అంది "అదేమిటి నువ్వు బావిలో పడ్డావుఅంది పనిపిల్ల"అన్నాడు దుర్గరావు."అదో అమాయకురాలు బోక్కన చేజారి బావిలోపడింది"అని అందరికి కాఫీలు యిచ్చివెళ్ళిపోయింది.బల్లపైనున్నమడత పెట్టిన పత్రం రంగయ్య చేతికిఅందించాడు దుర్గారావు.దాన్ని అలానే చేతి సంచిలో పెట్టుకుని వెళ్ళి పోయాడు రంగయ్య.దిగాలుపడిఉన్న రాఘవయ్యను చూస్తూ "అయ్యతమరు అమాయకంగా వేలిముద్ర వేసిన పత్రం యిదిగో "అని ఆపత్రం అందించాడు.ఆశ్చర్యపోయిన రాఘవయ్య"ఈపత్రం రంగయ్యతీసుకు వెళ్ళాడుగా"అన్నాడు."మనందరం బావిదగ్గరకు వెళ్ళినప్పుడు మాగుమ్మస్తా బల్లపై ఉన్నా నీపత్రాన్ని తీసి ఖాళి పత్రం ఆస్దానంలో ఉంచాడు దాన్ని రంగయ్య తీసుకువెళ్ళాడు.యిదంతా నేనే ఈనాటకం ఆడించి ఆపత్రం తెలివిగా మార్పించాను.రేపుమీకు డబ్బు అందగానే న్యాయమైన వడ్డితో రంగయ్యబాకి తీర్చండి. చదువుకొనకపోవడం .చదివినా మాత్రుభాషలో చదవకపోవడం,ఎంతఅనర్దానికి దారితీసిందోచూసారా !యిప్పటికైనా అందరికి మాత్రుభాష విద్య విలువ తెలిసేలా చెప్పండి"అన్నాడు. నిజమే మాత్రుభాష లో విద్యా అవస్యకత తెలిసివచ్చింది.చదువులేకపోవడం వలన వచ్చే కష్టాలను ఎదుర్కోనడానికి తను రాత్రిబడిలో చేరాడు రాఘవయ్య.
రాతనేర్చుకో నీతలరాతమార్చుకో :--డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి