బొమ్మలు :-డా.కందేపి రాణి ప్రసాద్
బొమ్మలండీ! బొమ్మలు
భలే భలే బొమ్మలు!

గల గల మాట్లాడే బొమ్మలు
గిర గిర తిరిగే బొమ్మలు

కళ్ళు ఆర్పే బొమ్మలు
కుచ్చుగౌను బొమ్మలు!

పాలపికతో నవ్వే బొమ్మలు
పీక తిస్తే ఏడ్చే బొమ్మలు

తల తిప్పే బొమ్మలు
తైతక్కలాడే బొమ్మలు

రెండు జడలు బొమ్మలు
రంగు రంగుల బొమ్మలు

స్ప్రింగ్ తో ఎగిరే బొమ్మలు
సాంప్రదాయాల బొమ్మలు

కళకళలాడే బొమ్మలు
కనుల పండుగగా బొమ్మలు

కామెంట్‌లు