బాలలూ అతని
శక్తి యుక్తులను తెలుసు కుందాం
జన్మదినాన్ని అభినందిద్దాం...
క్రమశిక్షణల కంబలి
కప్పుకున్న కార్యశీలి
అతను....
బాల్యం లోనే
బీదరికపు
భయపు నీడలో సేదతీరిన
భారత రత్నమతడు....
భారత రాజ్యాంగాన్ని
సుందరంగా
మెరుగులు దిద్దిన
రూపశిల్పి అతను.....
అంటరానితనాన్ని
అదఃపాతాళానికి తొక్కిన
అధినేత అతను....
సమగ్ర విజ్ఞానపట్టాలను
అవపోసన పట్టిన
అభినవ రాముడతడు....
చరిత్ర పుటలలో
చిరకాలం నిలిచిన
చారిత్రాత్మక చంద్రమతడు...
అందరు మెచ్చిన
అంబేద్కరుడతడు
అతనికే హృదయపూర్వక
జన్మదిన అభినందనలు....!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి