పరదా :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
వాకిలి కుండాలి పరదా 
దాగుడు మూతల సరదా 
లేకుంటే దుమ్ము చేరదా 
సొంత జీవితం విసుగవదా!

ఎండకు వానకు చోటీయదు 
నిద్రకు భంగం కానీదు 
స్నేహం మాటల సౌకర్యం 
పుస్తక పఠనం నిశ్శబ్దం !

ఇంటికి మాత్రమే పరదా 
మనసుకు వేయకు పరదా 
హృదయం నిండుగ కరుణ 
శాంతం ఉంటే సుఖం కదా !