నీలాకాశాన్ని నిత్యం పరికిస్తూనే
తరంగఘోషలో తరించే జలధి
ఆణిముత్యం తయారీకి సిద్ధం !
జీవితం ఆటుపోట్లు అనిపిస్తూ
తరగని స్ఫూర్తినిచ్చే సముద్రం!
మేఘమాలతో దోస్తీ కడలికి !
గవ్వలు శంఖాల కనువిందుగా
పిల్లలుకట్టే ఇసుకగూళ్ళు హాయి!
పల్లీలు,పువ్వుల జీవనోపాధి జలధి!
కడలంత ధైర్యం సముద్రయానంగానే
ఖండాలను కలిపే సూత్రం కడలి!
దారితప్పే ఓడకి లైట్హౌస్ దిక్సూచి!
పగడపుదీవులు పరవశం గానే
తిమింగలాల మాతృభూమి జలధి!
సముద్రరక్షణ అందరి కర్తవ్యం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి