ఎదురుచూసే
దృశ్యం కనుమరుగయ్యింది!
సంవత్సరమంతా
చదివిన కష్టాన్ని ఫలితాల్లో చూసుకొని
రాల్చిన ఆనందభాష్పాలు ఆవిరైనాయి!
సెలవులకోసం
హోం వర్కుతో నిండిన
నల్లబల్లలు బోసిపోయినాయి!
పాతపుస్తకాలను
తిరిగి భద్రపరిచే గది
బెంగటీలింది!
పంచుకొని తిన్న మధ్యాహ్నబోజనాలు
వీడలీక వీడుతున్న
బడి ప్రాంగణాలు
గతకాలాన్ని నెమరేసుకుంటూ ఘొల్లుమంటున్నాయి!
పిల్లలు ఉపాధ్యాయులందరూ
కలిసి గడిపిన ఆనందరోజులు కరువయ్యాయి!
విడిపోబోతున్న స్నేహాలు
చేసుకున్న బాసలు మూగబోయాయి!
బడిపిల్లల జాడకానరాక
ప్రేమైక గురువుల హృదయాలు
తల్లడిల్లుతున్నాయి!
కరోనా మింగేసిన
విద్యావత్సరపు ఛాయలతో..!!
వచ్చే యేడన్నా...
మంచిరోజులొస్తాయని ఆశిస్తూ
బాధాతప్త హృదయంతో.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి