సీతారాములపెళ్లి :-వరుకోలు లక్ష్మయ్య సిద్ధిపేట.

1కం.
రాముడు చేధించధనువు
భామిని సీతమ్మ మాల ప్రభుమెడ వేసెన్
స్వాములు దీవెన లివ్వగ 
యామెను చేకొనె రఘుపతి యానందముతోన్
2కం.
పీటలపైకినిసీతను
తోటిచెలులు గలసియునట తోడ్కొని రాగన్
మేటిగ కూర్చో బెట్టగ
కాటుక కన్నుల సుగాత్ర గాంచెను  రామున్
3కం.
కళ్యాణ మంత్ర పఠనము 
కళ్యాణము గనక గొప్ప కన్నుల విందున్
కళ్యాణగీతములతో
కళ్యాణమునాయెసీత కాంతకు నాడున్
4కం.
జనకుడు జననియు చెలులును
ఘనముగ నత్తింటికంప గల్లున నేడ్చెన్
మనమున ధైర్యము చెప్పియు 
తన పతిచేతిననుబెట్టి తరలిరి వారున్
5కం.
పురవాసు లెల్ల మురియగ 
తరలెను సీతమ్మ తోడ తన గృహమునకున్
తరుణులు మంగళ హారతు 
లరయగ నివ్వంగ జేరె యంతః పురమున్