టెర్రకోట బొమ్మలు -బాల గేయం :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఎర్రమట్టి తోటి చేయు 
టెర్రకోట బొమ్మలవియు 
చిన్నపెద్ద ఆకారం 
కన్నులకూ విందు చేయు !

పూలకుండీ అందాలు 
అలంకరణా  వస్తువులు 
ఎరుపు నునుపు మట్టిభలే 
గట్టివైన గృహ శోభలు !

చేప బొమ్మ కలములుంచు 
మేటి హుండి డబ్బులుంచు 
దీపస్థంభ మదిఎంత 
అందముగాను  కనిపించు !

భారతీయ హస్తకళలు 
సాటిలేని వృత్తి కళలు 
కుటుంబమును పోషించే 
కూర్మి యైన మట్టి నిధులు!


కామెంట్‌లు