రంగులు కలిపి బొమ్మలుగీద్దాం
తెల్లని కాన్వాస్ నింపేద్దాం
చెట్లూ పక్షులు జంతువులతో
పచ్చని అడవి అచ్చం గీద్దాం
పచ్చని చిలుక, నీలం నెమలి
తెల్లని బాతులు నల్ల ఎలుగులు
కాఫీ ఒంటెలు బూడిద ఏనుగు
చారల జీబ్రా చుక్కల జిరాఫీ
కొండలు నింగి చిత్రిద్దాము
ఉదయపు సూర్యుడు వేద్దాము
చంద్రుడు చుక్కలు మేఘాలతో
అందమైన బొమ్మలు గీద్దాము !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి