రామాయణం విశిష్టత: గుర్రాల లక్ష్మారెడ్డి

 రామాయణం ఎందుకు చదవాలి అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునేముందు రా-మా-య-ణం, అక్షరాల వెనుక ఉన్న పరమార్థం ఏమిటో ముందుగా తెలుసుకుందాం.
"రా"----మానవుని జీవితాన "రా"జి
పాడే అంశాలు లు, పడని వ్యతిరేక అంశములు పరిణమించవచ్చు.
అప్పుడు మానవుడు కుంగిపోక
విచక్షణ జ్ఞానాన్ని కోల్పో రాదని
ఈ వర్ణం వెనకున్న పరమార్థం.
"మా"-----మనిషి మనస్సు కోతి వంటిది. మానవ శరీరం కోర్కెల పుట్ట. మనసును, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం మానవుని లక్షణం. అని ఈ".మా"
వర్ణం తెలియజేస్తుంది.
"య"-----మనిషి యత్నం--ప్రయత్నం లేకుండా సమాజంలో ఏ కార్యాన్ని సాధించలేడు. ఒక లక్ష్యం--ఒక గమ్యం అను లక్షణాలను అతడు విధిగా పాటిస్తేనే విజయ శిఖరాన్ని చేరుకుంటాడు అన్న విషయాన్ని ఈ". "య" వర్ణం తెలుపుతుంది.
 "ణం "----మానవుని జీవిత పరిణామ  క్రమములో గుణం, ఋణం,వ్రణం,ధనం,ప్రాణం,కణం 
అను వివిధ అ బాధాతప్త అంశాలకు కు విలువలను అర్థం చేసుకుని తన జీవిత సక్రమ మార్గదర్శకాలకు అన్వయించుకుని నడవాలని ఈ "ణం"వర్ణం వెనకున్న వెనకున్న మతలబు.
రామాయణం చదువుట వల్ల మనం గ్రహించు విషయాలు--------------బహు భార్య సంబంధాల వల్ల సంభవించు కష్టనష్టాలు,
ఉదా--కైకేయి, కౌసల్య,, సుమిత్ర లు దశరథుని బహు భార్యలు. కైకేయి కోర్కెల వల్లనే గదా రాముడు అడవుల పాలు కావడం
 దశరథుడు మనో వ్యధతో మరణించడం.
మాటకు కట్టుబడడం-------పుత్రవాత్సల్యంవల్ల దశరథుడు మొదట రామలక్ష్మణులను విశ్వామిత్రుని తోపంపుటకు నిరాకరించడం, ఇచ్చి నమాట తప్పరాదని ఆలోచించి పంపుటకు అంగీకరిస్తాడు. అలానే 
కైకేయికి వరాలు తీర్చడం కూడా.
మాతాపితరుల మాట శిరోధార్యం....... తండ్రి మాట చెల్లించుటకు, తల్లి కైకేయికోర్కె నెరవేర్చుటకు రాముడు అడవులకు వెళ్ళేందుకు తన మన పూర్వకంగా అంగీకరించడం.
ఏకపత్నీవ్రతుడు.......... రాముడు బహు భార్యా విధానానికి స్వస్తి పలికి ఏక పత్ని వ్రతుడైనాడు.
భార్యను అమితంగా ప్రేమించి దాంపత్య సుఖదుఃఖాలను సమంగా ఆచరించిన వాడు.
సోదర ప్రేమ.......... రాముడు ఎక్కడ ఉంటే అక్కడనే లక్మణుడు,
అన్నా వదిన లను తల్లిదండ్రుల భావించి వారి దారిలోనే నడిచిన వాడు.
స్త్రీలను చెరబట్టడం............ సీతామాతను చెరబట్టి రావణుడు తాను మరణించడం కాక, తన లంక సామ్రాజ్యమును భూస్థాపితం చేసుకున్న వాడైనా డు.
ప్రజారంజక పాలన.......... ప్రజలను రాజు కన్నబిడ్డలుగా చూడడం, ప్రజల సుఖదుఃఖాలు పాలు పంచుకోవడం, ప్రజలకు నచ్చిన పాలన అందివ్వడం.
ఇలా అనేక క సద్గుణాల సమాహారమే మన రామాయణం.
కాన అందరూ చదివి తరించాలి.
జై శ్రీరామ్  జై శ్రీరామ్. జై శ్రీరామ్.