కుదురెరుగని నా మనసుకు..
రెక్కలు ఇచ్చేందుకు..
అటో ఇటో ఎటో దాగున్నది ఓ రోజు..!!
ప్రతియేటా మొదటి రోజున..
నను దర్శించుట.. దానికో రివాజు.
చేతులుపుకుంటూ..
నను చేరుట..
దానికి ...లేని అలవాటు.
పచ్చదనపు, ధనమును.. పంచకుండా..
ఊరకుండ లేదు..!!
షడ్రుచుల సంగమాన్ని..
నా చేత త్రాగించకుండా..
నా జత వీడిపోదు..!!
కొంగొత్త ఆశలు చిగురించేలా..
ఒక వంక చూపిస్తూ..!!
నెరవేరని కోరికలు..
నెరవేరాలని దీవిస్తూ.
గత ఏడాదికి.. వీడ్కోలు పలికేస్తూ..
కొత్త ఏడాదికై.. వేసెను,
పునాది.. తాను వస్తూ వస్తూ..!
అంటరాని , అంటురోగం..
అంతమయ్యే రోజు..
ముందుందని..!!
తీరని తంటాలు.. తీరేందుకు..
తన సహకారం ఉంటుందని..
ప్లవ నామ సంవత్సరం, నమ్మ పలికినది..
తనను తాను పరిచయం చేసుకొని.
బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ సంవత్సర శుభాకాంక్షలతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి