గుర్తింపు ...!!:- '---డా.కె.ఎల్వీ. హన్మకొండ.

 పనిగట్టుకుని
పొగిడించుకుంటాడు !
పని పడితే ,
పొగడ్తల తాళాలతో ,
బట్రాజు
అయిపోతాడు !
ఇంద్రుడు ..చంద్రుడు
అంటే ...
ఎగిరి గంతేస్తాడు !
సరసమైన ధరలతో ,
బిరుదులిచ్చేవారితో ,
ఎల్లప్పుడూ ...
కలసి మెలసి
తిరుగుతాడు ,
దాహం తీరేదాకా ,
ఒక యఙ్ఞమై
రగిలిపోతాడు !
దీనికోసం ...
అవసరం అనుకుంటే ,
మంది పాదాలు ,
మహా పవిత్రంగా ,
కళ్ళకద్దుకుంటాడు !
వెర్రి ..వెర్రి ...చేష్టలతో
ఇల్లు ..గుల్ల చేస్తాడు .
అవార్డుల వ్యామోహం లో ,
అతిగా ...
దిగజారి పోతాడు !!
పస ఉండి
అది పదిమంది
కళ్లల్లో పడితే ,
మన ప్రమేయం
లేకుండానే
గుర్తింపు
ఎదురొస్తుంది !
ఇలాంటి గుర్తింపు ,
మల్లెపూల సౌరభం లా ,
బ్రతుకంతా ,
గుబాళిస్తుంది !!
        
కామెంట్‌లు