పంచ ధర్మాలు : -వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సిద్దిపేట.
జీవితమనే వృక్షములో 
విలువల ఫలాలు పొందుదాం 
సత్య, ధర్మ, శాంతి, ప్రేమ 
అహింసను పాటించుదాం 

సత్యమంటే యేమిటో తెలుసా 
నాకు తెలుసు నాకు తెలుసు 
మార్పు లేనట్టిది మాసిపోనట్టిది 

సత్యమంటే శాశ్వతము 
దాచినా దాగనిది 
శీల నిర్మాణం పెంచునది 
స్వయం ప్రకాశ మైనది 
ఉన్నదున్నట్టు తెలుపునది 

సత్యమునే పలికినాడు 
సత్య హరిశ్చంద్రుడు 
కష్టములెదురైన గాని 
అసత్య మాడ లేదు 

చరిత్రలోన నిలిచాడు 
చరితార్థమైనాడు 
యుగ యుగాల వరకు తాను 
సత్య వంతుడిగా నిలిచాడు 


కామెంట్‌లు