మళ్ళీ మళ్ళీ వస్తుంది
పల్లె పట్నం తిరుగుతుంది
ఊరువాడ చూస్తుంది
ఉయ్యాలలూగుతుంది
వీచే గాలి లో వస్తుంది
వేగంగా తిరుగుతుంది
ఎదురొచ్చిన వారిని
వదలకుండా పడుతుంది
చేయి చేయి కలిపితే
చెలిమి చేయ చూస్తుంది
ఒంటి లోన చేరుతుంది
ఒడిసి నిన్ను పట్టుతుంది
చిన్న పెద్ద తేడాలేకుండా
చిత్రంగా హింసిస్తుంది
కళ్ళకు కానరాని కరోనా
జనమంతా జాగ్రత్త జాగ్రత్త
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి