శరీరాన్ని కాదు-మెదడును విసర్జించాలీ !?:-- ప్రతాప్ కౌటిళ్యా
పట్టు పురుగు విసర్జిస్తే వస్త్ర మైంది

తేనేటీగా విసర్జిస్తే తియ్యటీ హానీ అయ్యింది

వాడు సహస్రాక్షుడు కాదు కానీ నీ నేత్రాన్ని విసర్జించి సహస్రాక్షుడు అయ్యిండు!?

ఒకడు పాదాన్ని ఒకడు హస్తాన్ని విసర్జించి వామనుడు భస్మాసురుడు అయ్యిండు!?
కానీ
వీడు మెదడుని బహిష్కరిస్తూ ఉన్నాడు
ప్రపంచం కొంచెం అయింది మనిషి మంచి మనిషి అయ్యిండు!?

నేను నేను నా మెదడును బహిష్కరిస్తున్నాను!?
ఆవిష్కరణలు పరిష్కారాలు ప్రగతి ప్రతిభా మరో ప్రపంచం ఆకాశ మార్గం గుండా కాదు భూమార్గం పట్టింది!?

పాదము ఉన్నంతవరకు రెక్కలొచ్చి ఎగిరినా
భూమిపై నడవాల్సిందే లేదా పాదాన్ని వదులుకోవాల్సిందే!?
అందుకే నేను నా మెదడును విసర్జిస్తూ ఉన్నాను!?


రాజు రాణి రాజ్యం దక్కాలంటే సైన్యం ధనం కారణం కాదు?!
శరీరాన్ని విసర్జించాల్సీన అవసరం లేదు
మెదడును బహిష్కరించాలి మెదడును విసర్జించాలి!?

మరో ప్రపంచం ఆకాశ మార్గం గుండా కాదు భూమార్గం పడుతుంది!?

Pratapkoutilya
8309529273
06/04/2021
కామెంట్‌లు